YSR Congress Party Rajya Samba member Vijaya Sai Reddy for 'Butta Renuka as YSRCP floor leader' <br /> #YSRCongressParty <br /> <br />పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రెండేళ్లుగా కోరుతోంది. <br />విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రేపటి నుంచి పార్లమెంటు హాలులో వైసీపీ మాజీ ఎంపీలం నిరసన చేపడతామని విజయ సాయి రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.