బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ మరింత రసవత్తరంగా సాగబోతోంది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎంటరయ్యాడు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ రంగంలో నెం.1 మేల్ యాంకర్‌గా తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ రాకతో అటు ప్రేక్షకుల్లోనూ ఈ రియాల్టీ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.<br />