Surprise Me!

సమయానికి జేసీ దెబ్బ..బాబుకు ఆడని ఊపిరి ..!!

2018-07-19 224 Dailymotion

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన తీరుపై పార్టీ అధిష్టానం, సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. అవిశ్వాసం చాలా కీలకమని, ఇలాంటి సమయంలో ఆయన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. <br /> ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఓ వైపు ఎంపీలతో అవిశ్వాసంపై సంప్రదింపులు జరుపుతూ.. జేసీ వ్యవహారంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఓ వైపు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతుంటే సొంత పార్టీ ఎంపీ ఇలా అలక వహించడం సరికాదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. <br /> జేసీ ఇష్యూ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ఇదిలా ఉండగా, జేసీ సమస్య సాయంత్రానికల్లా తీరుతుందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించేందుకు ఇప్పటికే పలువురు నేతలు రంగంలోకి దిగి, ఆయనతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

Buy Now on CodeCanyon