Ram Gopal Varma disappointed by Sanju. Plans to make 'real' Sanjay Dutt biopic
#RamGopalVarma
#Sanju

ఎక్కడ వివాదం అక్కడకు వర్మ వెతుక్కుంటూ వెళతాడు. ఆ విషయం మరో మారు రుజువైంది. రాంగోపాల్ వర్మ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సంజు చిత్రం తనని తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. సంజయ్ దత్ బయోపిక్ ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని ప్రకటన చేశాడు. వర్మ ప్రకటనతో బాలీవుడ్ లో దుమారం మొదలైంది. సంజు చిత్రంలో వాస్తవాలని పక్కన పెట్టి సంజయ్ దత్ ని మంచోడిగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉన్న సంగతి తెలిసిందే.
రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళుతోంది. 300 కోట్లకు వసూళ్లుతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ చిత్రంతో కనెక్ట్ అయ్యారు.
యధార్థ గాధలని తెరకెక్కించాలనే ఆసక్తితో వర్మ ఉంటాడు. సంజు చిత్రం తాన్ని నిరాశ పరిచిందని, సంజయ్ దత్ బయోపిక్ ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని వర్మ ప్రకటన చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.