Surprise Me!

బాబూ ఢిల్లీకి ఎందుకు? రాహుల్ తహతహ : పురంధేశ్వరి ఫైర్

2018-07-21 3 Dailymotion

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేత పురంధేశ్వరి, ఎంపీ హరిబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు వేదికగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చట్టంలో లేని హామీలను కూడా కేంద్రం నెరవేరుస్తోందని చెప్పారు. <br />అవిశ్వాసానికి మద్దతు పలికిన పార్టీలకు ధన్యవాదాలు చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి ఏ ఒక్క పార్టీ కూడా మద్దతుగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు ఎవరికి ధన్యవాదులు చెబుతారని పురంధేశ్వరి ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఏపీ గురించి అర నిమిషం కూడా మాట్లాడలేదని అన్నారు. వారికి చంద్రబాబు ధన్యవాదాలు <br />పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని పురంధేశ్వరి మండిపడ్డారు. బీజేపీకి అవినీతి అంటగట్టాలని రాహుల్ గాంధీ తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. <br /> <br />BJP leaders Purandeswari, Kambhampati Hari Babu on Saturday fired at TDP and Congress for blaming BJP.

Buy Now on CodeCanyon