Kauvery hospital in Chennai released a medical bulletin stating that Former Tamil Nadu Chief Minister and DMK patriarch M Karunanidhi's health had and a team of medical experts were treating him for fever due to urinary tract infection and had kept him under observation for 24 hours.
#Kauveryhospital
#Karunanidhi

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మూత్రనాళాల ఇన్ప్‌క్షన్ కారణంగా బాధ పడుతున్నారని, ఈ కారణంగా జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన చికిత్స అందిస్తున్నామని, ఫ్లూయిడ్స్ ఇస్తున్నామని చెప్పారు.
కరుణానిధి నివాసంలోనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడటంతో అభిమానులు, నేతలు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. అయితే.. కరుణానిధికి విశ్రాంతి అవసరమని, ఆయణ్ని చూసేందుకు సందర్శకులను అనుమతించరాదని వైద్యులు సూచించారు.