Jana sena chief Pawan Kalyan takes on YSR Congress Party chief YS Jagan Mohan Reddy for his bridegroom forever comments in Bhimavaram.
#pawankalyan
#janasena
#andhrapradesh
#ysjagan

తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే జగన్ తనను వ్యక్తిగతంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ఫ్యాక్షనిజానికి, గూండాగిరికి పవన్ ఏమాత్రం భయపడరని చెప్పారు. బాంబులు వేసినా, వేటకొడవళ్లు తీసుకొచ్చినా, బరిసెలు తీసుకు వచ్చినా.. తన లోపల విప్లవం రగులుతోందని, తనను ఎవరూ భయపెట్టలేరన్నారు. నేను జగన్‌ను అడిగింది ఒక్కటేనని, అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని వ్యాఖ్యానించారు.