Priyanka Chopra signs Hollywood film Cowboy Ninja Viking. Salman Khan Salman fans on PC.
#SalmanKhan
#PriyankaChopra
#Hollywood

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే 'భారత్' చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. ప్రముఖ దర్శకుడు అలీ జాఫర్ ఈ చిత్రానికి దర్శకుడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ నటించబోతోంది. ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి నో చెప్పింది. తాజగా ప్రచారం జరుగుతున్న విషయం ప్రియాంకపై సల్మాన్ ఖాన్ అభిమానులకు ఆగ్రహం కలిగించే విధంగా ఉంది. ఇది సల్మాన్ ని అవమానించడమే అని అంటున్నారు.
సల్మాన్ ఖాన్, ప్రియాంక కలసి నటించి చాలా కాలం అవుతోంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా స్థాయి వేరు. ప్రియాంక ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయింది. హాలీవుడ్ లో సైతం పీసీ సత్తా చాటుతోంది. వీరిద్దరిని ఓ చిత్రంలో జంటగా చూడాలని అభిమానులు ముచ్చటపడ్డారు. కానీ ఆ కోరిక తెరలేదు.