Comedian turned Hero Sunil is back to shooting as a comedian in NTR's 'Aravindha Sametha'. Sunil reportedly has been paid in 1 crore for This movie.
#Sunil
#trivikram
#ntr
#sunilRemuneration
#AravindhaSametha

ఒకప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్‌గా వెలుగొందాడు సునీల్. వరుస అవకాశాలతో తీరికలేకుండా వందల సినిమాల్లో నటించిన సునీల్ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కమెడియన్‌గా మారిపోయాడు. అయితే ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయడం బోర్ కొట్టేయడంతో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడంలో భాగంగా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టడం, తొలుత అతడు హీరోగా నటించిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో కమెడియన్ వేషాలు మానేసి పూర్తి స్థాయి హీరోగా కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస ప్లాపులతో నిర్ణయం మార్చుకున్న సునీల్ మళ్లీ సాధారణ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు.
సునీల్ హీరోగా సినిమాలు చేసినపుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. హీరోగా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీ సైతం పెంచాడు. అయితే అదృష్టం కలిసిరాక పోవడంతో అతడి ప్రయాణం సాఫీగా సాగలేదని చెప్పక తప్పదు.