Goodachari Twitter review. Black buster reports from allover
#GoodachariTwitterreview
#adivisesh
#sobhitadhulipala
#sashi kiran tikka

క్యారెక్టర్ రోల్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అడవి శేష్ ఒక్కో చిత్రంతో తన సత్తా చాటుకుంటూ వచ్చాడు. హీరోగా నటించిన క్షణం చిత్రం అడవి శేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికి అడవి శేష్ ని చిన్న హీరోగానే పరిగణించాలి. గూఢచారి చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురుచూసారు. ఆ రోజు రానే వచ్చింది. గూఢచారి చిత్రం నేడు ప్రేక్షకులముందుకు రాబోతోంది. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీమియర్ షో రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.