ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హిమదాతా సినిమాస్ సమీపంలోని క్రిస్టల్ టవర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో భవనంతా పొగ వ్యాపించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందు లెవెల్-2గా భావించినా తర్వాత తీవ్రతను బట్టి లెవెల్-3గా అంచనా వేశారు.
#parel
#MumbaiCrystalTower
#himdatacinemas
#Exit
#HighAlert
#Extinguisher