Surprise Me!

నా చావుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్యే కారణం: యువకుడి సెల్ఫీ వీడియో

2018-09-20 804 Dailymotion

సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీకాంత్‌కు కొంతకాలం క్రితం పెళ్లయింది. వీరిది ప్రేమ పెళ్లి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లడంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అమ్మాయిని తల్లిదండ్రులు బలవంతంగా తీసుకు వెళ్లారని చెబుతున్నారు. మనస్తాపంతో అతను కిరోసిన్ పోసుకొన్నాడు. ఆయన బాడీ బాగా కాలిపోయింది. అమ్మాయి తండ్రి పోలీస్ డిపార్టుమెంటులో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలోను అతను పలుమార్లు బెదిరించినట్లుగా తెలుస్తోంది.#srikanth <br />#love <br />#SanthoshNagar <br />#Hyderabad

Buy Now on CodeCanyon