Don't try to see another side of coin, Denduluru MLA Chintamaneni Prabhakar warning to Jana Sena chief Pawan Kalyan.
#DenduluruMLA
#ChintamaneniPrabhakar
#JanaSena
#PawanKalyan
#telangana

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను రౌడీ అన్నాడని, అవును.. తాను అసెంబ్లీ రౌడీని అని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రౌడీయిజం చేస్తానని, తమ్ముడు పవన్‌పై నేను వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఆయన తట్టుకోలేడని, మూడ్రోజులు అన్నం తినలేడని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాను ఎవరినైనా చంపించానా, ఎవరినైనా బహిరంగ వేధింపులకు గురిచేశానా విచారణ జరిపించుకోవచ్చునని చింతమనేని ప్రభాకర్ సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు పవన్ కళ్యాణ్ బహిరంగ విచారణకు సిద్ధమా అన్నారు. దెందులూరు సభలో పూర్తిగా తనపై విమర్శలకే సమయం కేటాయించారన్నారు. తన తప్పులను ఎత్తి చూపితే పవన్‌ను తాను అభినందిస్తానని, కానీ అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు.