Surprise Me!

సెకన్ల ముందు: ఇండోనేషియా సునామీ భయానకం(వీడియో): 1,571కి చేరిన మృతుల సంఖ్య

2018-10-05 15,595 Dailymotion

జకార్తా: గత కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, భారీ సునామీ కారణంగా భారీ ఆస్తి నష్టం, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సునామీ ధాటికి సులవేసి దీవిలోని పాలూ నగరం అతలాకుతలమైంది. భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద భారీగా మృతదేహాలు చిక్కుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య శుక్రవారానికి 1,571కి చేరినట్లు అధికారులు తెలిపారు. భూకంపం-సునామీ కారణంగా 70 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.<br />

Buy Now on CodeCanyon