Watch the heart wrenching visuals of a farmer who broke down in front of the district collector. In a heart wrenching video, an aggrieved farmer in Madhya Pradesh broke down in front of a District Collector and fell at her feet as he was distressed over his produce getting destroyed because of no transformer.

పంట పండించి పదమందికి అన్నం పెట్టే రైతన్న కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మదిని కదిలింప చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఓ రైతన్న తన సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. కానీ దానికి పరిష్కారం లభించలేదు. చేసేది లేక చివరకు కలెక్టర్ కాళ్ల పైన పడి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రనౌద్ గ్రామంలో చోటు చేసుకుంది. కలెక్టర్ కాళ్లు పట్టుకున్న సదరు రైతు వయస్సు 30 ఏళ్లు. తన పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఇన్‌స్టాలేషన్ విషయంలో అతను శివపురి కలెక్టర్ అనురాగ్ కాళ్లు పట్టుకున్నారు. ఈ సంఘటన డిసెంబర్ 28వ తేదీన జరిగింది. సదరు రైతు గోడు విన్న కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
#Farmer
#Collector,
#MadhyaPradesh
#heartwrenching
#transformer,