India Vs Australia 2019:KL Rahul and Rishabh Pant have been included in the T20I and ODI squads against Australia in a series which will be a run-up to the World Cup 2019.
#indiavsaustralia2019
#teamindiaSquadForAustraliaSeries
#ViratKohli
#MSdhoni
#rohtihsharma
#rishabpanth
#yuzvendrachahal
#jaspritbumrah
#cricket
#teamindia

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సుదీర్ఘ సిరిస్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు టీమిండియా జట్టుకు ప్రకటించారు.
న్యూజిలాండ్ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. దీంతో విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించారు.
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధానికు గురై న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్‌కి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును దాదాపు ప్రకటించారు.
ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శ చేసిన పేసర్ జయదేవ్ ఉనాద్కట్‌కు చోటు దక్కుతుందని భావించినప్పటికీ అతడికి నిరాశే ఎదురైంది. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా తొలి టీ20 ఫిబ్రవరి 24న జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది.