Rohit Sharma will open the batting for Mumbai Indians in the upcoming season of the Indian Premier League (IPL), the franchise captain confirmed on Tuesday.
#IPL2019
#RohitSharma
#MumbaiIndians
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#chennaisuperkings
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగుతానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ చెప్పాడు. మంగళవారం జట్టు మెంటార్ జహీర్‌ఖాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తాజా సీజన్‌పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా గతేడాది ఏ స్థానంలోనూ కుదురుకోకపోవడంతో ఈసారి ఓపెనింగ్ చేస్తానని రోహిత్ శర్మ ప్రకటించాడు.
ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో టీమిండియా వెట క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. అయితే, చివరి నిమిషంలో యువీని కనీసధర రూ.కోటికే ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు.
యువరాజ్‌ను జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో మిడిలార్డర్ మరింత బలంగా మారిందని రోహిత్ చెప్పాడు. గత మూడు నాలుగు ఐపీఎల్ సీజన్లలో సరిగ్గా ఆడని యూవీ ఈ సీజన్‌లో తమ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని చెప్పాడు. ఈ సీజన్‌లో యువీ మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.