IPL 2019: Most successful teams of the IPL—Mumbai Indians and Chennai Super Kings—final in Hyderabad on Sunday, following a rather eventful season that produced some unprecedented moments on the field.
#ipl2019
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma

ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంటోంది. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన ఓపెనర్లు డికాక్ (29: 17 బంతుల్లో 4x6), రోహిత్ శర్మ (15: 13 బంతుల్లో 1x4, 1x6) వరుస ఓవర్లలో పెవిలియన్‌కి చేరగా.. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (23: 26 బంతుల్లో 3x4), సూర్యకుమార్ యాదవ్ (15: 17 బంతుల్లో 1x4), కృనాల్ పాండ్య (7: 7 బంతుల్లో) పేలవంగా వికెట్ చేజార్చుకున్నారు. దీంతో.. 17 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 120/5తో నిలిచింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లూ మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి ఇండియన్స్ జట్టే విజయం సాధించింది. దీంతో.. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి లెక్క సరిచేయాలని చెన్నై టీమ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు నాలుగో టైటిల్‌పై కన్నేసిన ముంబయి టీమ్ అదే గెలుపు జోరుని కొనసాగించాలని ఆశిస్తోంది. 12 ఏళ్ల ఐపీఎల్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లూ చెరో మూడు టైటిల్స్ గెలవగా.. ఈరోజు ఏ జట్టు గెలిచినా.. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో 4వ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డుల్లో నిలవనుంది.