"Thank you all for the unconditional love ❤️ I’m sorry that I cudn reply to all the tweets( I really wish I could but I’m so bad at this )I hope u enjoy watching NGK at theatres Tomo ♥️ Until next time ,sending u lots n lots of love." Sai Pallavi said.
#saipallavi
#rakulpreet
#ngkmovie
#surya
#selvaraghavan
#rowdybaby
#mca
#nani
#tollywood

మలయాళ చిత్రం 'ప్రేమమ్', తెలుగు మూవీ 'ఫిదా' తర్వాత సాయి పల్లవి క్రేజ్ సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమెకు అందం పరంగా, టాలెంట్ పరంగా ఎంత గుర్తింపు వచ్చిందో... అదే స్థాయిలో నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది. సాయి పల్లవి పొగరుబోతు అని, తన కోస్టార్లను ఇబ్బంది పెడుతుందనే రూమర్స్ తరచూ వింటూనే ఉన్నాం. కొందరు స్టార్స్ కూడా సాయి పల్లవి యాటిట్యూడ్ గురించి పరోక్షంగా విమర్శలు చేయడం కూడా ఆమెపై వ్యతిరేక వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో సినీ ప్రేమికుల్లో కూడా సాయి పల్లవిపై అటు ఇటుగా కాస్త నెగెటివ్ ఇంప్రెషనే ఉంది. NGK సినిమా రిలీజ్ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్ ఆమెతో సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సాయి పల్లవి నుంచి సరైన స్పందన లేక పోవడంతో కొందరు ఆగ్రహానికి గురయ్యారు.
అయితే తన ఫాలోవర్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ రావడం గమనించిన సాయి పల్లవి ఒక మెట్టు కిందకి దిగింది. తాను సరిగా స్పందించనందుకు సారీ చెబుతూ ట్వీట్ చేసింది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొంది.