An argument broke out between BJP MP Pragya Thakur and other people onboard over allotment of the seats at a Delhi to Bhopal SpiceJet flight.
In the video, people can be seen confronting Pragya and reminding her, a man said, “Your job is not to trouble us”.
Pragya Thakur and other man also argued over the language used.
#PragyaSinghThakur
#SpiceJet
#SadhviPragya
#RajaBhojAirport

వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి కొత్త కాంట్రవర్శీ క్రియేట్ చేశారు.
స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఆమె లోపల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
అనంతరం ఆమె సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానంలో చోటుచేసుకున్న వాగ్వాదం వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
ఆమె ఒక ఎంపీ అని ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని విమాన సిబ్బందికి ఇతర ప్రయాణికులు చెబుతున్నట్లుగా వీడియోలో వినిపిస్తోంది.
ఇక అసలు విషయంలోకి వస్తే ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లేందుకు ఎంపీ ప్రగ్యా సింగ్ స్పైస్ జెట్ విమానంలో సీటును రిజర్వ్ చేసుకున్నారు.
ఆమె 1A సీటును బుక్ చేసుకున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఆమెకు మరో సీటును కేటాయించడంపై ప్రగ్యా ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి తరహా విమానాల్లో 1A సీటును దివ్యాంగులకు మాత్రమే కేటాయిస్తామని స్పైస్ జెట్ అధికారులు తెలిపారు.
ఇక వాగ్వాదానికి దిగడంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.