స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో దూసుకుపోతోందే అందరికీ తెలిసిందే. విపరీతమైన పోటీ ఉన్నా.. సంక్రాంతి బరిలోకి దిగి నెగ్గింది. బాక్సాఫీస్‌పై దాడి చేస్తూ రికార్డులన్నీ బద్దలుకొడుతోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్లా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయగా.. ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది.<br /><br />Ala Vaikunthapurramuloo Success Celebrations At Vizag