Amaravathi Farmers and women hold jala deeksha with amaravati slogans against three capitals.
#amaravathifarmers
#amaravathi
#amaravathifarmersjaladeeksha
#apfarmers
#ap3capital
#ysjagan
#chandrababunaidu
#andhrapradesh

ఓవైపు వైసీపీ ప్రభుత్వం విశాఖ నుంచీ పాలన సాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే... ఇప్పటికీ అమరావతి రైతులు, స్థానికులు తమ ఆందోళనలు శాంతియుతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వారు... కృష్ణానదిలో దిగి... జల దీక్ష చేపట్టి పూజలు చేశారు. రాయపూడి దగ్గర రైతులు, మహిళలు మెడ లోతువరకు నీళ్లలో మునిగి నిరసన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా జల దీక్షకు దిగడంతో... నిరసనలు ఉద్ధృతరూపు దాల్చుతున్నాయి. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ రాజధాని అంటూ వారంతా నినాదాలు చేస్తున్నారు. 42 రోజులుగా తాము నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం చెందుతున్నారు.