తన భర్త ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తన తండ్రి మారుతీరావుకు చట్టపరంగా శిక్షపడాలని భావించానే తప్ప ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకోలేదన్నారు అమృత. ప్రణయ్‌ని హత్య చేయించాడన్న కోపమే తప్ప ఆయనతో తనకెలాంటి వ్యక్తిగత వివాదాలు లేవన్నారు. సూసైడ్ నోట్‌లో 'అమృతా.. తల్లి వద్దకు వెళ్లు..' అని ఆయన రాసినదాన్ని గౌరవించాను కాబట్టే.. కడసారి చూపుకోసం వెళ్లానని అన్నారు. కానీ తన బాబాయ్ శ్రవణ్ స్నేహితులు తనను అడ్డుకున్నారని.. అడ్డుకున్నది కుటుంబ సభ్యులు కాదని అన్నారు.తాను పాజిటివ్ మాట్లాడినా,నెగటివ్ మాట్లాడినా.. నెగటివే తీసుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
#AmruthaPranay
#AmruthaPranaypressmeet
#MaruthiRao
#Pranay
#Amrutha
#AryaVaishyaBhavan
#Miryalaguda