IPL 2020: We haven’t planned anything as of now. We can’t think of IPL getting back yet said BCCI Treasurer Arun Dhumal
#ipl2020
#bcci
#lockdown3
#LiquorShopsOpen
#BCCITreasurerArunDhumal

కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావిత ప్రాంతాలను గ్రీన్, ఆరేంజ్, రెడ్ జోన్‌లుగా విధించిన భారత ప్రభుత్వం.. గ్రీన్, ఆరేంజ్ జోన్‌లో నిబంధనలు పాటిస్తూ అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. వైన్ షాప్‌లకు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తుందని వార్తలు హల్‌చల్ చేశాయి