Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : JEEVAATHMA PARAMAATHMA

పల్లవి : జీవాత్మ, పరమాత్మ ఒకటేరన్నా!
ఇక నేనను, నీవను బేధమె లేదు, లేదన్నా "2"

అ.ప : పరమాత్మను నీవు, నీలోన కనరన్నా
పరతత్వమంటూ ఎచటనో లేదన్నా
ఓ లాలా, ఓ లాలా, ఓ లాలా.... "జీవాత్మ ” "2"

చరణం : నీ సాటివారితో సఖ్యతగా నువు మనుమన్నా
నీ తోటివారినీ ప్రేమించుటయె, మరి మిన్నన్న
సాటి జీవులపై కనికరము కనరన్నా!
నీపాటికి నీవే వుండుట, ఇక మరి తగదన్నా "జీవాత్మ" "2"

చరణం : అన్నెం, పున్నెము, ఎరుగని ఈ తరువులపై జాలి చూపన్నా!
నీ ఆత్మకు సాక్షివి నీవేరా! ఓరన్నా ఇది ఎరుగన్నా
నీ ఆత్మ శోధనయె పరమాత్మను జేర్చన్నా
అదియే సుఖము, ఇలలో ఇతరము యిక లేదన్నా "జీవాత్మ"