Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KANTIMI

పల్లవి : కంటిమి, నీదు సుందర రూపము,
మా వెన్నంటి యున్న, మంగళ రూపము "2"

చరణం : అలమేలు మంగాపురమున, వరముగ నిలచి
అలవోకగ, నీ అద్భుత రూపమునే గాంచి "2"
కామితార్ధములు తీర్చును మా కల్పవల్లి "2"
కనక వర్షములు, కురిపించును, మా చల్లని తల్లి "కంటిమి"

చరణం : కొండల రాయుని, కోమలాంగివి, మా తల్లి "2"
మా అండగ నుండేటి, అమ్మలగన్నమ్మ "2"
క్రీగంటి చూపుల, వేంకట నాధుని ప్రియ సతి
శ్రీపతి అలుకలు దీర్తువు చక్కని మా తల్లి
చక్కదనముతో, మృదుభాషణముల, నగవుల తల్లి "కంటిమి"