Surprise Me!

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ సేల్స్ స్టోర్ ప్రారంభించిన మినీ కార్ బ్రాండ్

2020-09-17 1,778 Dailymotion

బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ మినీ ఇండియా, భారత మార్కెట్లోని వినియోగదారుల కోసం కొత్తగా ఆన్‌లైన్ రిటైల్ షాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, కస్టమర్ ఇకపై తమ ఇంటి నుంచే సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేని కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.<br /><br />కస్టమర్లు Shop.mini.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం మినీ శ్రేణి మోడళ్లను, వాటి ఫీచర్లు, వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, మినీ కార్ల కోసం కంపెనీ అందిస్తున్న వివిధ రకాల యాక్ససరీలతో కస్టమర్లకు తమ కారును తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.<br />

Buy Now on CodeCanyon