సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు.
