T20 world cup 2021 : South Africa opener withdraws after CSA directive on taking the knee<br />#T20WORLDCUP2021<br />#Savswi<br /><br />ఏదీ ఏమైనా తాను 'బ్లాక్‌లైవ్ మ్యాటర్స్' ఉద్యమానికి మద్దుతు ఇచ్చేది లేదని మొండిపట్టుతో ఉన్న సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో బాగా హర్ట్ అయిన డికాక్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు ఆడేలేనని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డుకు తెలిపాడు. దాంతో అప్పటికప్పుడు అతని స్థానంలో రీజా హెన్రిక్స్‌ను సౌతాఫ్రికా టీమ్‌మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టీ20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ సైతం ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి.