ప్రముఖ జర్నలిస్ట్ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీలో మంగళవారం చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ మల్లన్నకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మల్లన్నకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడారు. కేసీఆర్‌ను విడిచిపెట్టేది లేదంటూ ఫైర్ అయ్యారు.
