తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది భౌతికకాయాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి మద్రాస్ రెజ్మింటల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ అమరు సైనికులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘన నివాళులర్పించారు. సైనికాధికారుల పార్దీవ దేహాలపై ఆయన పుష్పగుచ్చం ఉంచి నివాళలర్పించారు.