Surprise Me!

సిటీ బస్సెక్కిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

2021-12-10 575 Dailymotion

గురువారం సజ్జనార్‌ స్వయంగా సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల బాధలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి లక్డీకాపుల్‌ మీదుగా టెలిఫోన్‌ భవన్‌ వరకు కాలినడకన వచ్చిన ఆయన అక్కడ మెహిదీపట్నం డిపోకు చెందిన 113/ఐ/ఎం బస్సెక్కి టికెట్‌ తీసుకున్నారు. సచివాలయం మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని బస్‌భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు టెలిఫోన్‌ భవన్‌ బస్టాపులో ఉన్న ప్రయాణికులతో సజ్జనార్‌ కాసేపు ముచ్చటించారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, బస్సుల్లో శుభ్రత, సౌకర్యాలపై ఆరా తీశారు.

Buy Now on CodeCanyon