రాజాం డీఏవీ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిపి 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. పాఠశాలలో టీచర్లు, విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో 9 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
