మిస్ యూనివర్స్ 2021గా భారతీయ యువతి హర్నాజ్ సంధూ ఎంపికయ్యింది. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధూ రికార్డు నెలకొల్పింది. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుపొందింది. పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న హర్నాజ్.. చివరకు అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన హర్నాజ్ సంధూకు గతేడాది మిస్ యూనివర్స్ మెక్సికో భామా అండ్రాయి మెజా కిరీటాన్ని అలంకరించారు.