Dale Steyn in line to be roped in as SRH's bowling coach
#Srh
#SunrisersHyderabad
#OrangeArmy
#DaleSteyn

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బాధ్యతల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 పేలవ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ తప్పుకున్న విషయం తెలిసిందే. 2016 టైటిల్ గెలిచిన అనంతరం వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఇక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తమ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ సేవలను కూడా కోల్పోయింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే