Surprise Me!

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు

2021-12-17 38 Dailymotion

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మొదటగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడాతూ... అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అని అభిప్రాయపడ్డారు. 3 రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాయమాటలు చెబితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు అన్నారు.

Buy Now on CodeCanyon