తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడ్రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.
