Surprise Me!

రైలు కింద పడబోతుండగా మహిళను కాపాడిన కానిస్టేబుల్.. ఏమైందో మీరే చూడండి

2022-02-22 53 Dailymotion

కదులుతున్న రైలు నుంచి దిగబోతు రైలు కిందపడబోయిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన 53 ఏళ్ళ పార్వతి కుటుంబసభ్యులతో కలిసి 20 మంది బృందంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతి నుంచి ఆదివారం ఉదయం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు బయలుదేరింది. సోమవారం సాయంత్రం రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులంతా రైలు దిగగా, పార్వతి చివరలో దిగుతుండగా రైలు వేగం పుంజుకుంది. దీంతో కోచ్ డోర్ వద్ద వేలాడుతూ రైలు కింద పడబోయింది. అదే సమయంలో ప్లాట్‌ఫాం విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చిన్నరామయ్య అప్రమత్తమై పార్వతిని చేతులతో పట్టుకుని లాగడంతో ఇద్దరు ప్లాట్‌ఫాంపై పడ్డారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.. కాని‌స్టేబుల్‌ను ఆర్పీఎఫ్ సీఐ కృష్ణ, సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.

Buy Now on CodeCanyon