Surprise Me!

ఆర్జితసేవల టికెట్ ధరలు పెంపుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్

2022-03-04 218 Dailymotion

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందంటున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని.. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని.. ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ధరల పెంపుపై కేపాలకమండలిలో కేవలం చర్చ మాత్రమే జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమని.. వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పదిరోజులవుతోందని.. రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామన్నారు సుబ్బారెడ్డి. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని.. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Buy Now on CodeCanyon