Surprise Me!

ఆలయాల్లో చొరబడి దొంగల బీభత్సం.. ఏం చేశారో చూడండి

2022-03-15 101 Dailymotion

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో దొంగలు వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో బొల్లోరిగూడెంలోని శివాలయంలో హుండీని పగులకొట్టి అందులోని సొత్తును ఇద్దరు దొంగలు దొంగిలించారు. అనంతరం పక్కనే వున్న సత్యసాయి బాబా మందిరంలో అదే ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సాయిబాబా మందిరంలో దొంగతనానికి గురైన వెండి వస్తువుల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. బొల్లోరిగూడెం శివాలయంలో సీసీ పుటేజ్‌లు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు.. వారం రోజుల కింద గట్టాయిగూడెంలో చోరీలు జరిగాయి.

Buy Now on CodeCanyon