జంగారెడ్డిగూడెంలోని మరణాలు సహజ మరణాలు అంటూ మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిశెట్టి మాట్లాడారు. తమ వారు కల్తీ మద్యం సేవించడం ద్వారానే మరణించారని కుటుంబ సభ్యులు చెబుతుంటే.. ఈ అంశాన్ని మారుగునపెట్టేందుకే మంత్రి ఆళ్ల నాని ఫుడ్ పాయిజన్ ద్వారా మరణించారని, అవన్నీ సహజ మరణాలని చెబుతున్నారని మండిపడ్డారు.
