ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటి సమీక్షలోనే అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి 10 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారా అని ఆరా తీశారు. ఇవాళ గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాలపై పవన్ సమీక్షించనున్నారు.
