శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆశీనులవుతారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్న సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని ప్రకటించారు.