Khammam Floods : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈసారి కూడా వరద ముప్పు తప్పేలా లేదు. కొన్నేళ్లుగా భారీ వర్షాలకు ఖమ్మం నగరం సహా మిగతా పట్టణాల్లో కాలనీలకు కాలనీలే చిగురుటాకులా వణికిపోయాయి. గతేడాది వానాకాలంలో భారీ వరదల ధాటికి ఖమ్మం నగరంతో పాటు పలు పురపాలికలు రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గాయి. అయినప్పటికీ బల్దియాల యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నాయి. గత వరదల అనుభవాలు ఇప్పటి నుంచే బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.<br />
