సామాన్యుడి నుంచి అసమాన్య వ్యక్తిగా ఎదగాలంటే, లక్ష్య సాధనకు కృషిచేస్తేనే సాధ్యమవుతుందని ఈనాడు తెలంగాణ దినపత్రిక సంపాదకుడు డీఎన్ ప్రసాద్ అన్నారు. అలా విజయం సాధించిన వారిలో దివంగత రామోజీరావు ఒకరని ఆయన పేర్కొన్నారు. పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే, వచ్చే ఫలితాలు కూడా తీయని ఫలాలను ఇస్తాయని రామోజీరావు నమ్ముతారని డీఎన్ ప్రసాద్ తెలిపారు.
