Dharani Portal Change in Telangana : ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండడంతో ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తున్నది. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
