Surprise Me!

అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్న పోకిరీలు - నడి రోడ్డుపై బైక్​తో ప్రమాదకర స్టంట్స్

2024-06-23 29 Dailymotion

Bike Racing At Raidurgam in Hyderabad : వారాంతపు సెలవులు వస్తే చాలు అర్ధరాత్రి భాగ్యనగరంలో యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ల ప్రాణాలతోపాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో రాత్రిపూట బైక్ రేసింగ్‌లు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీహబ్ ప్రాంతంలో భారీగా బైక్ రేసింగ్ జరిగింది. వాహనాల రాకపోకల మధ్య బైకులపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాలకు చేరుకున్న యువత సందడి చేశారు. అయితే తమ కళ్ల ముందే యువకులు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.<br /><br />

Buy Now on CodeCanyon