BRS MLAs Join to Congress in Telangana : శాసనసభ్యుల వలసలు భారత రాష్ట్ర సమితిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు గుడ్ బై చెప్పారు. మరికొందరు శాసనసభ్యులు సైతం గులాబీ పార్టీని వీడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొందరు మాత్రం పార్టీ పెద్దలను కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నట్లు సమాచారం.