International Day Against Drug Abuse : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పలు కళాశాల నిర్వాహకులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మత్తు పదార్ధాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు.
