చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరమన్నారు. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పని చేశారన్న చంద్రబాబు, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. అలాంటి అక్షరయోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.